బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తక్కువ కాలంలో తనకుంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలు చేస్తు మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమె తాజాగా ముంబైలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగొలు చేసినట్లు తెలుస్తోంది. ముంబైలోని జుహు ఏరియాలో అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసిందట. దాని విలువ దాదాపు రూ.13.11 కోట్లని తెలుస్తోంది. కెరీర్ పిక్ స్టేజ్‌లో ఉన్న ఆమె ఇలా ఫ్లాట్ కొనుకొలు చేయటం పెద్ద విషయం ఏమి కాదు. అయితే అలియాకు ఇంకా 25 ఏళ్లు కూడా నిండలేదు. ఇలాంటి వయస్సులోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ విషయంలో అలియా తల్లిదండ్రులు పెద్దగా నియామాలు ఏమి పెట్టరు. ఎందుకంటే బాలీవుడ్‌లో ఎవరి లైఫ్ వారికి ఉంటుంది.
ఇక ఆమె కొంతకాలంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో డేటింగ్ సాగిస్తోంది.ఇతనితో వ్యక్తిగతంగా ఉండటానికే అలియా ఇలా ఫ్లాట్‌ను కొనుగొలు చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి.త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని అందుకే ముందుగానే అలియా ఫ్లాట్‌ను కొనుగొలు చేసిందని ఆమె సన్నిహితులు చెబుతన్నారు. ఇక ఆమె గతంలో సిద్దార్ధ్ మల్హోత్రతో కొంతకాలం ఎఫైర్ నడిపింది. ఇతనికి బ్రేకప్ చెప్పేసి ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో ఎఫైర్ సాగిస్తోంది. మరి ఈ ఎఫైర్‌నైనా పెళ్లి వరకు తీసుకువెళ్తుందో లేదో చూడాలి.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’