- Advertisement -

తెర‌పైకి అల్లు అర్జున్ – బసిల్ జోసెఫ్ క్రేజీ కాంబినేషన్!

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మలయాళ స్టార్ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ కలయికలో సినిమా రాబోతుందనే వార్త గత కొంతకాలంగా టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప 2’ విడుదల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌పై చర్చలు మొదలయ్యాయి. అయితే, అల్లు అర్జున్ వరుసగా అట్లీ దర్శకత్వంలో ‘రాకా’, లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్టులకు సిద్ధమవ్వడంతో, బసిల్ జోసెఫ్ సినిమా ఉంటుందా? లేదా? అనే సందేహాలు తలెత్తాయి. కానీ ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన పరిణామాలతో ఈ కలయిక ఖరారైందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌పై మళ్ళీ చర్చ మొదలవ్వడానికి ప్రధాన కారణం దర్శకుడు బసిల్ జోసెఫ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక పోస్ట్. ఆయన తన పోస్ట్‌లో ‘ఐకాన్’ అని రాసి ఉన్న టోపీని, అలాగే అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య 2’ చిత్రంలోని ‘రింగ్ రింగ్’ పాటను జతచేశారు. అల్లు అర్జున్‌ను అభిమానులు ‘ఐకాన్ స్టార్’ అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బసిల్ జోసెఫ్ చేసిన ఈ పోస్ట్, అల్లు అర్జున్‌తో సినిమాను కన్ఫర్మ్ చేసినట్టేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మలయాళంలో ‘మిన్నల్ మురళి’ వంటి పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని అందించిన బసిల్ జోసెఫ్, అటు నటుడిగానూ, ఇటు దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. అటువంటి దర్శకుడితో అల్లు అర్జున్ జతకట్టనుండటంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయితే అది ఖచ్చితంగా ఒక వైవిధ్యమైన చిత్రంగా ఉంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -