ఎన్నడూ లేని విధంగా కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. పచ్చదనంతో కళకళలాడే కేరళ వర్ష బీభత్సంతో చిగురుటాకులా వణికిపోయింది. భారీ వరదల కారణంగా 37 మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే కోలీవుడ్ నటులు ముందుకొచ్చారు.
విశాల్, సూర్య, కార్తి, కమల్ హాసన్ తదితరులు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్పటికే సీఎం సహాయ నిధికి కమలహాసన్ రూ.25 లక్షల విరాళం అందజేయగా, తాజాగా అల్లు అర్జున్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రూ.25 లక్షల చొప్పున విరాళం అందించారు.
People of Kerala will always occupy a special place in my heart for the unmatchable Love & Affection they shower . Their Love & the Loss is Unmatchable. But still I take the Honour to do my bit. I hereby pledge to donate 25,00,000 for the #KeralaFloodRelief . Love “M”Allu Arjun
— Allu Arjun (@alluarjun) August 13, 2018