Monday, April 29, 2024
- Advertisement -

బన్నీ టీమ్ ఓవర్ చేస్తుందా?

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం అగ్ర కథానాయకులు గా వెలుగొందుతున్న హీరోలు ఎవరికీ లేనటువంటి ఒక డేడికేటెడ్ పీ ఆర్ టీమ్ కేవలం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మాత్రమే ఉంది. మొదటి నుంచి తన కెరీర్ ని అలా మలుచుకుంటూ, పీ ఆర్ టీమ్ ని పెట్టుకొని, అవసరం అయినప్పుడు అల్లా వారిని వాడుతూ తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు బన్నీ.

అయితే సినిమా షూటింగ్స్ కోసం సాధారణం గా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం కి హీరోలు వెళ్లడం సర్వ సాధారణం. కానీ బన్నీ మాత్రం హైదరాబాద్ ధాటి ఒక వూరికి వెళ్తున్నాడు అంటే పీ ఆర్ టీమ్ అలర్ట్ అయిపోతుంది. ఎక్కడికి వెళితే అక్కడైకి బైక్ రాలీ ల తో పాటు బన్నీ కి ఘానా స్వాగతం దొరికే లా ఏర్పాట్లు చేస్తుంది.

ఎప్పుడు వెళ్ళే ప్రదేశాలే అయినా బన్నీ కి మాత్రం స్పెషల్ గా స్వాగతం ఉంటుంది. నేడు కాకినాడ కి చేరుకున్న బన్నీ కి ఘన స్వాగతం లభించింది. అభిమానులు వందల సంఖ్యల్లో హాజరయి పెద్ద ఎత్తున బన్నీ ని ఆహ్వానించారు. అయితే చూడటానికి, వినటానికి బాగానే అనిపిస్తున్న కొద్దిగా అత్యుత్సాహం కూడా చూపిస్తున్నారు అనే భావన కలుగుతుంది. అసలే వర్షా కాలం. సైలెంట్ గా బన్నీ కాకినాడ చేరుకొని, తన పనేదో తను చేసుకుంటే అయిపోయేది కదా అని కొందరు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -