Thursday, May 9, 2024
- Advertisement -

సమంత ట్వీట్‌కు…బ‌న్నీ రియాక్స‌న్‌..

- Advertisement -

హార్డ్‌వర్క్‌లో నటుడు అల్లు అర్జున్‌ ‘హీరో’ అని స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రశంసించారు. ఈ ప్ర‌శంశ ఎందుక‌నుకుంటున్నారా..?అల్లు అర్జున్ మాదిరి డాన్స్ చేయడానికి ప్రయత్నించి విఫలమైందట. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

‘అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ సినిమాలో లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అనే పాటలో బన్నీ క్యాప్ పెట్టుకొని కొన్ని ట్రిక్స్ తో డాన్స్ చేశాడు. ఎలాంటి ఎఫెక్ట్స్ ఉపయోగించకుండా బన్నీ ఈ డాన్స్ చేశాడు. క్యాప్‌ ట్రిక్‌ డ్యాన్స్‌ను తాను మూడు గంటలపాటు యత్నించినా చేయలేకపోయానని సమంత ట్వీట్‌ చేశారు. అందుకే అల్లు అర్జున్‌ హార్డ్‌వర్కర్‌ అని ఆమె కితాబిచ్చారు.

సమంత ట్వీట్‌పై బన్నీ స్పందిస్తూ రీట్వీట్‌ చేశారు. కొన్ని ట్రిక్స్ నేర్పించడానికి నాకేం అభ్యంతరం లేదు. ఎవరైనా నేర్పిస్తే చాలా ఈజీ అవుతుంది’ అని చెప్పాడు. దానికి సామ్ సరే అన్నట్లుగా ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -