అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్రీ-రీలిజ్ ఈవెంట్ నిన్న(ఆదివారం)గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది.ఈ వేడుకకు ముఖ్య అతిధిగా రాంచరణ్ హాజరైయ్యాడు.ఈవెంట్‌లో పలు ఆశక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.ఈ సమావేశానికి టిడిపి ఎంపీ జేసీ కుమారుడు పవన్ రెడ్డి కూడా వచ్చాడు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతు అల్లు అర్జున్ నాకు పెద్దగా తెలియదని లగడపాటి శ్రీధర్ వల్ల బన్నీ పరిచియం అయ్యాడని చెప్పుకొచ్చాడు.బన్నీని చాలా దగ్గర ఉండి గమనించానని బన్నీ వచ్చే రోజులలో రాజకీయలలోకి రావడం ఖాయంగా చెప్పాడు పవన్.
బన్నీకి రాజకీయ అవగాహన చాలా ఉన్నది. ఆయన రాజకీయాలను క్షణ్ణంగా అధ్యయనం చేస్తారని చెప్పుకొచ్చాడు. ఇక పవన్ మాటలకు షాకైన బన్నీ నవ్వుతూనే.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ తల పట్టుకుని అలాంటిది ఏం లేదు అంటూ తల ఊపుతూ సమాధానం ఇచ్చారు అల్లు అర్జున్.