Saturday, May 18, 2024
- Advertisement -

అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అల్లు ఆర్జున్ స‌ర్‌ప్రైజ్‌

- Advertisement -

దువ్వాడ జగన్నాథమ్’తో దుమ్ము దులిపేసిన అల్లు అర్జున్, వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా షూటింగును మొదలు పెట్టేశాడు. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులకు అందుతూ ఉండాలనీ .. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో అల్లు అర్జున్ వున్నాడట.

ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15న ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూ ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని చెప్పాడు. ఆ గిఫ్ట్ ఏమిటనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది దేశభక్తి నేపథ్యంలో కొనసాగే సినిమా కావడం వలన .. అల్లు అర్జున్ పోషించేది ఆర్మీ ఆఫీసర్ పాత్ర కావడం వలన .. ఫస్టు లుక్ ను వదిలే ఛాన్స్ ఉందనుకోవచ్చు. దీంతో పాటు మరేదైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి మరి.

ఇది అల్లు ఆర్జున్ అభిమానుల‌కు పండ‌గే.డిజె సినిమాపై పెట్టుకున్న అభిమానుల ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి.సినిమా డిప‌రెంట్ టాక్‌ను తెచ్చుకుంది.అలా జ‌ర‌గ‌కుండా ఈసారి అల్లు అర్జున్ ప‌క‌డ్బందీగా వ‌స్తున్నారు.త్వ‌ర‌లోనె ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -