- Advertisement -

కొడుకు పెళ్లి గురించి అసలు విషయం చెప్పిన బన్నీ తల్లి..!

- Advertisement -

అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. ఒకరు మాస్టర్ అయాన్ .. మరొకరు బేబీ అర్హ. అప్పుడప్పుడు వీళ్ళ అల్లరి చేస్తున్న ఫోటోలు, ఆడుకుంటున్న వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు అల్లు అర్జున్, స్నేహారెడ్డి. అయితే బన్నీ, స్నేహ లది ప్రేమ వివాహమే కాదు.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా..! మరి వీరి వివాహానికి పెద్దలు ఎలా అంగీకరించారు? అనే విషయాల్ని ఇటీవల బన్నీ అమ్మగారు అయిన నిర్మల గారు తెలియజేసారు.

వాస్తవానికి బన్నీ.. స్నేహాను ప్రేమిస్తున్నట్టు అలాగే పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నట్టు ముందు ఆమె తల్లి.. నిర్మల గారితోనే చెప్పాడట. అప్పుడు ఆమె ‘నీ సంతోషమే మాకు ముఖ్యం.. మేము చూసిన అమ్మాయి అయినా నీకు నచ్చితేనే చేస్తాను.. ఇప్పుడు నువ్వే ఓ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాను అని చెప్పావ్.. అదే చాలా సంతోషకరం’ అంటూ జవాబిచ్చిందట. ఇక అల్లు అరవింద్ గారు విషయం తెలుసుకుని 5 నిమిషాల్లో డిస్కస్ చేసి.. ఓకే చేసేసారట. అలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ని చాలా సింపిల్ గా ఓకే చేయించుకున్నాడు మన అల్లు అర్జున్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -