పాటతో సినిమా పూర్తి.. విడుదలకు సిద్ధం
బన్నీ సినిమా అంటే పాటలు ప్రత్యేకంగా ఉంటాయి. ఫీల్‌గుడ్ పాటలతో పాటు మాస్ బీట్ పాట తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆ విధమైన ట్రెండింగ్‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు వక్కంతం వంశీ తొలి దర్శకత్వంలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఫైట్లు, పాటలు ప్రత్యేకంగా ఉండేలా చిత్ర బృందం ప్లాన్ చేసింది.
పాటలు, ఫైట్లు వైవిధ్యంగా ఉండేందుకు కసరత్తు చేశారు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ సినిమాలో ఓ పాట కోసం తెగ కష్టపడుతున్నాడు బన్నీ. ఆ పాట సినిమాలో చాలా కీలకంగా ఉండడంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు బన్నీ. ఆ పాట కోసం నేషనల్ వైడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్, ఇంటర్నేషనల్ ఫేమ్ వీడియో ఆల్బమ్ మేకర్‌ను ప్రత్యేకంగా హైదరాబాద్‌కు తీసుకువచ్చి పాట కోసం పని చేస్తున్నారు.
ఈ బృందంతో అర్జున్ ఏడెనిమిది రోజులు రిహార్సల్ చేస్తారట. రిహార్సల్ అనంతరం అమెరికా వెళ్లి పాట పూర్తి చేయనున్నారు. పాట మొత్తం అక్కడే షూటింగ్ చేస్తారు. షూట్టింగ్ వరకే కాకుండా పాటకు సంబంధించిన పని అంతా అమెరికాలోనే పూర్తి చేయాలని ప్లాన్. మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఏప్రిల్‌లో సినిమా విడుదల చేయనున్నారు. బన్నీ పక్కన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.