మెగాబ్రదర్ నాగబాబు తనయ నిహారికకు, గుంటూరు రేంజి ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల పెళ్లి వేడుక జరుగుతోన్న విషయం తెలిసిందే. మెగా కుటుంబాలన్నీ ఉదయ్‌పూర్ బయలుదేరారు. ఎపటికపుడు పెళ్లి పనుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చెస్తుంది నిహారిక.

అయితే ఇరోజు ఉదయం నాగబాబు కుటుంబ సభ్యులు, చైతన్య కుటుంబ సభ్యులు ఓ ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ఉదయ్‌పూర్ కి బయలుదేరారు. ఈ సందర్భంగా పెళ్లికొడుకు జొన్నలగడ్డ సెల్ఫీ తీశాడు. వీరి వివాహానికి ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ హోటల్ వేదిక కానుంది.

తాజాగా అల్లు కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ పయనం అయ్యారు. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులతో పాటు అల్లు అరవింద్ దంపతులు ఉన్నా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

