సైన్యం ఇతివృత్తంగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందుతున్న సినిమా నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. ఈ సినిమాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ రొమాన్స్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ టీజర్, రెండు పాటలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమా షూటింగ్ పూర్తయి మే 4వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమాలో పవర్‌ఫుల్ సైనికుడి పాత్రలో బన్నీ కనిపిస్తున్నాడు. బన్నీ పక్కన అను ఇమాన్యుయేల్ కనిపిస్తోంది. అయితే ఈ సినిమాపరంగా హీరోయిన్ అల్లు అర్జున్ షాకిచ్చేశాడు హీరోయిన్‌కు. ఎందుకంటే ఈ సినిమాలో బన్నీ, అను మధ్య రొమాన్స్ సీన్స్ బాగా పండాయి. స్టార్ హీరోతో నటించాననే ఆనందంలో ఉన్న అనుకు ఆ ఆనందం సినిమా విడుదల సమయంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే అను ఇమ్మన్యుయేల్ పాత్ర నిడివి తగ్గించేస్తున్నారు.
బన్నీ, అను ఉన్న రొమాన్స్ సీన్స్‌కు కత్తెర చేసేస్తున్నారు. ఎడిటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సీన్స్‌కు కోత వేస్తున్నారు. బలమైన కథ ఉన్న సినిమా కావడంతో రొమాన్స్ సీన్స్.. లవ్ ట్రాక్ సీన్స్ ఇబ్బంది అవుతాయని అల్లు అర్జున్ తొలగించమని దర్శకుడు వక్కంతం వంశీని కోరాడు. ఈ మేరకు ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర్‌రావుకు చెప్పారు. దీంతో బన్నీ, అనుల మధ్య సీన్స్‌కు కత్తెర పడినట్టయ్యింది. దీంతో అను ఇమ్మాన్యుయేల్ ఒకింత బాధగా ఉండిపోయింది.