- Advertisement -

మ‌రో చాన్స్ మిస్ చేసుకున్న హాట్ బ్యూటీ

- Advertisement -

అమలాపాల్ కెరీర్ పెళ్లికి ముందు పెళ్లికి త‌రువాత ఇలా రెండు భాగాలుగా విభ‌జించి చూడాలి. పెళ్లికి ముందు కొన్ని సినిమాలే చేసిన అమలాపాల్ ,పెళ్లి త‌రువాత చాలా అవకాశాలు చేజికిచ్చుకుంది. విడాకులు తీసుకున్న త‌రువాత త‌న అందానికి మ‌రింద ప‌దును పెడుతు కుర్ర‌కారు నిద్ర లేకుండా చేసింది.ఇప్పుడు ఈ అమ్మ‌డికి బ్యాడ్ టైం న‌డుస్తున్న‌ట్లు ఉంది. సినిమా చాన్స్‌లు వ‌రుస పెట్టి మిస్ అవుతున్నాయి.నాగార్జున, నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దీనికి దర్శకుడు. ఈ సినిమాలో నాగార్జున సరసన అమలాపాల్ ను అనుకున్నారు.

ఆ విషయాన్ని అమలాపాల్ కూడా అప్పట్లో పరోక్షంగా నిర్థారించింది. కానీ ఏమైందో ఏమో అంతలోనే ఆమెను తొలిగించారు. అమలాపాల్ స్థానంలో ఆకాంక్ష సింగ్ ను ఎంపిక చేశారు. అమలాపాల్ విషయానికొస్తే టాలీవుడ్ లో ఒకే ఒక్క ఆధారం మిగిలింది. వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా రాబోతున్న ఎఫ్-2అనే సినిమాలో వెంకీ సరసన అమలాపాల్ ను తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -