Sunday, May 12, 2024
- Advertisement -

కమర్షియల్ హీరో గా జూనియర్ రౌడీ

- Advertisement -

దొరసాని సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టిన యువ హీరో ఆనంద్ దేవరకొండ. విజయ్ దేవరకొండ తమ్ముడిగా అందరికీ పరిచయం అయినా ఆనంద్ మాత్రం తన తెరంగేట్రాన్ని తన సొంతం గా ప్లాన్ చేసుకొని పరిశ్రమ లో కి వచ్చాడు. మొదటి సినిమా కి కూడా విజయ్ పెద్దగా సపోర్ట్ ఇచ్చింది లేదు. అయితే ఇప్పుడు రెండో సినిమా కి మాత్రం ఆనంద్ మొదటి సినిమా లాగా కాకుండా ఒక మంచి కమర్షియల్ కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడట.

ఇప్పటికే రెండో సినిమా తో అయినా జనాలని మెప్పించాలి అని ఎన్నో కష్టాలు పడుతున్న ఆనంద్ కమర్షియల్ కథ అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడని తెలిసింది. తన పాత్ర పరం గా కంప్లీట్ చేంజ్ ఈ సినిమా తో ఆనంద్ తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్నాడట. ఇప్పటికే సినిమా ని అంగీకరించాడట. త్వరలో నే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందట.

పక్కా కమర్షియల్ కథ తో అన్ని రకాల ఎలెమెంట్స్ ఉండేలా ఈ సినిమా తో ఆనంద్ చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -