Tuesday, May 6, 2025
- Advertisement -

కొంద‌రు చీప్ ప‌బ్లిసీటీ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు – అన‌సూయ‌

- Advertisement -

ఇండియా మొత్తం లైంగిక వేధింపుల చూట్టునే తిరుగుతుంది. పలువురు హీరోయిన్లు, నటీమణులు తనకు జరిగిన వేధింపుల గురించి మీటూ ఉద్యమం ద్వారా తెలియజేస్తున్నారు. దీనితో బాలీవుడ్ కు చెందిన పలువురు దర్శకులు, నిర్మాతలు, నటులపై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీటూ ఉద్యమం సెగ తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు కూడా పాకింది.

తాజగా యాంకర్ అనసూయ మీటూ ఉద్యమంపై తన స్పందన తెలియజేసింది. కొన్నిరోజులు పెద్ద సెలెబ్రిటీలు మీటూ ఉద్యమం గురించి స్పందిస్తున్న తీరుని గమనిస్తున్నా. కొంతమంది తమకు ఎదురైన వేధింపులపై మాట్లాడుతున్నారు. మరి కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నట్లు అనిపించింది.నిజంగా వేధింపులు ఎదురైన వాళ్ళు మాత్రమే స్పందించండి. పబ్లిసిటీ కోసం దీనిని మరింత పెద్దదిగా చేయవద్దు అని అనసూయ సూచించింది. అందరి దృష్టిని ఆకర్షించడం కోసం మీటూ ఉద్యమాన్ని దుర్వినియోగం చేయవద్దు అని అనసూయ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -