Saturday, April 27, 2024
- Advertisement -

అనసూయ పొలిటికల్ ఎంట్రీ!

- Advertisement -

బుల్లితెరకు గ్లామర్‌ అద్దిన యాంకర్లలో ఒకరు అనసూయ. అందం, అభినయంతో తనదైన చలాకితనంతో యాంకరింగ్‌ కే సొగబులు అద్దిన ఈ బ్యూటీ ఎప్పటికి హాట్ ఫేవరేటే. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫోటోషూట్ షేర్ చేస్తే కుర్రకారు ఫిదా కావాల్సిందే. అంతలా ప్రేక్షకులను తన అందంతో ఆకట్టుకుంది.

ఇక ఓ వైపు బుల్లితెర మరోవైపు వెండితెర రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకుసాగుతోంది అనసూయ. ఇక ప్రస్తుతం ఆమె నటించిన రజాకార్ విడుదలకు సిద్ధంగా ఉంది. స్వాతంత్ర్యం రాకముందు తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారు అనసూయ.

ఈ సందర్భంగా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా, రాజకీయాల్లోకి వచ్చి ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఏదైనా పార్టీ మిమ్మల్ని ఆహ్వానించిందా అని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పింది. రాజకీయం నా వాళ్ళ కాదు. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అయినా ఏమన్నా చేయాలంటే బయట ఉండి కూడా ఉద్దరించొచ్చు అని చెప్పుకొచ్చింది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేయనిద్దాం. నేను బయట ఉండే చాలా చేస్తున్నాను అని రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తెలిపింది. ఇక ఏ పార్టీ తనను ఆహ్వానించలేదని ..అసలు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -