Tuesday, May 14, 2024
- Advertisement -

రవి చేసిన పనికి బూతులు తిట్టిన అనసూయ..!

- Advertisement -

ప్రస్తుతం ఉన్న మేల్ యాంకర్స్ లో యాంకర్ రవి ఒకరు. ఆయన ఓ మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత కొన్ని షోలలో తనదైన కామెడీతో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. యాంకర్ రవికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక గతంలో యాంకర్ లాస్య తో ప్రేమాయణం నడుపుతున్నాడు అనే వార్తలు రావడంతో రవి మరింత పాపులర్ అయ్యాడు. కాకపోతే అందులో నిజం లేదని తర్వాత తెల్చేశాడు. ఇక ‘పటాస్’ షో లో తన మార్క్ పంచ్ డైలాగ్ లతో .. తన క్రేజ్ ను డబుల్ చేసుకున్నాడు అనే చెప్పాలి. కొన్ని సినిమాల్లో కూడా నటించిన రవి.. కానీ వాటిలో పెద్దగా రాణించలేకపోయాడు. ఇక తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఎవరికి తెలియని సీక్రెట్ చెప్పాడు. ఓ సారి స్టార్ యాంకర్ అయిన అనసూయకు రవి ప్రాంక్ కాల్ చేసాడట. ‘నేను తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ నుండీ కాల్ చేస్తున్నాను’ అంటూ సంభాషణ మొదలుపెట్టాడట.

అది నిజమని నమ్మేసిన అనసూయ.. డీటెయిల్స్ అన్నీ చెబుతూ కాల్ ను కంటిన్యూ చేసిందట. చివరికి ‘నేను రవిని.. సరదాగా ప్రాంక్ కాల్ చేశాను’ అని రవి రెవీల్ చెయ్యగా.. ‘అనసూయ సీరియస్ అయ్యి బూతులు తిట్టిందట. రవితో ఉన్న చనువు వల్లే అలా చేసిందని రవి వివరించాడు. ఇలా సరదాగా చేసిన ప్రాంక్ కాల్ కు తిట్లు తిన్నాను అంటూ యాంకర్ రవి చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -