అనసూయ యాంకర్‌గా , నటిగా, ఇల్లాలుగా , తల్లిగా ఇలా అన్ని రకాలుగా తన జీవితంలోని అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మహిళ. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్లో న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది అనసూయ. ఆ తరువాత పలు టీవీ షోలకి వ్యాఖ్యతగా వ్యవహారిస్తు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ గుర్తింపు కారణంగానే ఆమెకు పలు సినిమాల్లో పిలిచి మరి అకకాశాలు ఇచ్చారు దర్శక- నిర్మాతలు. క్షణం, రంగస్థలం సినిమాల్లో తన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా అనసూయకు వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయాట.
తాజాగా అనసూయకు చిరంజీవి, అల్లు అర్జున్ చిత్రాల్లో నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అనసూయని సంప్రదించినట్లు తెలుస్తోంది. కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో కూడా అనసూయ కోసం ఓ పాత్ర డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలకు కూడా అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక టీవీ షోలతో కూడా ఫుల్ బిజీగా ఉంది అనసూయ.
- Advertisement -
అనసూయ ఎక్కడ తగ్గడం లేదుగా..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -