Thursday, May 16, 2024
- Advertisement -

అనసూయ ముందు ప్యాంట్ వేసుకో.. నెటిజన్లు ఫైర్..!

- Advertisement -

సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక అనసూయ వస్త్రధారణ విషయంలో సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. ఆమె పొట్టిపొట్టి బట్టలు వేసుకుని కవ్విస్తూ అందాలను ఆరబోస్తుంటే.. ఆమె ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కానీ ఆమెని ఇష్టపడని వారు ఇద్దరు బిడ్డలు తల్లివి ఇలా పొట్టి బట్టలు వేసుకుంటావా ? ఇదేనా మన సంస్కృతి.. ఇలా విప్పుకుంటూ పోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అంటూ ఫైర్ అవుతూ ఉంటారు.

మామూలుగా ఓ మోస్తరు బట్టలు వేసుకున్నా.. ఆమెను ఏకిపారేస్తుంటారు నెటిజన్లు. ఇక ఇదే విషయంపై అనసూయ కూడా ఫైర్ అవుతూ ఉంటుంది. అసలు మీరెవరూ.. నాకు బట్టలు గురించి మాట్లాడటానికి..? చూపించే నాకు కాదు.. చూసే మీకు సిగ్గు ఉండాలి? మీలో ఆ కామపు చూపుని ముందు చంపేయాలి.. ముందు మీ ఆలోచన మార్చుకోండి. నా భర్తకు పిల్లలకు లేని అభ్యంతరం మీకు ఎందుకు?? ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసే వాళ్లను ఏం చేసిన పాపం లేదు అంటూ ట్రోలర్స్ గట్టి వార్నింగ్స్ కూడా ఇస్తోంది అనసూయ. ఇక తాజాగా అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ లో మరో పోస్ట్ పెట్టింది. బుల్లి చెడ్డీ, పైన టీ షర్ట్‌తో వంటగదిలో వీరలెవల్లో డాన్స్ చేస్తూ ఊగిపోతూ వీడియో వదిలింది.

వరల్డ్ డాన్స్ డే సందర్భంగా ఈ వీడియోను పోస్ట్ చేసింది అనసూయ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక క్వారంటైన్‌లోనూ కిచెన్‌లోనే గడిపేస్తూ అదే పొట్టి చెడ్డీతో వంట చేస్తూ వీడియోలు వదులుతుండటంతో.. ‘ఛీ ఛీ ఇదేంది అనసూయా!! కాస్తైనా పద్దతీ పాడూ లేకుండా ఇలాంటి బట్టలతోనే డాన్స్ చేసేది?? నా భర్తకు పిల్లలకు అభ్యంతరం లేదు మీకెందుకు అనీ మళ్లీ విరుచుకు పడుతుంటావ్.. కాని!! ఇంట్లో ఉన్న యవ్వారాన్ని తీసుకుని వచ్చి ఇలా ఆన్ లైన్‌లో పెట్టుకోవడం మర్యాదా? అంటూ ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. డాన్స్ చేసావు బానే ఉంది కానీ.. కింద ప్యాంట్ వేసుకోవచ్చు కదా అనసూయ గారు అంటూ ఆమెకి నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.

https://www.instagram.com/tv/B_XlVqblMxs/?utm_source=ig_embed

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -