మనం వెండితెర మీద కెమిస్ట్రీ పంచే హీరో, హీరోయిన్స్‌ను చూశాం. కాని బుల్లితెర మీద కెమిస్ట్రీ పంచే నటీ,నటులను మనం ఎప్పుడు చూశామా…అవునండీ మీరు చదివింది నిజమే. బుల్లితెర మీద కెమిస్ట్రీ పంచే జోడీ ఉన్నారు.యాంకర్ రష్మీ,సుడిగాలి సుధీర్‌లు బుల్లితెర మీద హాట్ పెయిర్ అని చెప్పాలి. వీరిద్దరు కలిసి కనిపిస్తే చాలు ఈ షో సూపర్ డూపర్ హిట్ అయినట్లే.వీరిద్దరు ప్రవర్తన చూస్తుంటే నిజంగానే ప్రేమలో ఉన్నట్లు కనిపిస్తుంది. వీరు కావాలని నటిస్తున్నారో లేక నిజంగా ప్రేమలో ఉన్నారో తెలియక బయట జనం జుట్టు పిక్కుంటున్నారు. ఇక వీరిద్దరి క్రేజ్‌ను మాత్రం టీవీల వారు బాగానే క్యాష్ చేసుకుంటున్నారు.
తాజాగా వీరిద్దరి కలిసి తిరుపతిలో జరగనున్న ఓ ఈవెంట్‌కు హాజరవునున్నారని తెలుస్తుంది. , రష్మీ హాజరుకానున్నట్లు ఓ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే దీనిపై రష్మీ స్పందించింది. నాకు ఈ ఈవెంట్ కి ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎవరూ దీని గురించి సంప్రదించలేదు. నాకు చెప్పకుండానే పోస్టర్ లో నా ఫోటో పెట్టి ఈవెంట్ కి హాజరవుతున్నట్లు పోస్ట్ చేశారు. దీని స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే వారికి తెలియజేయండి’ అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికి రష్మీ, సుధీర్‌లు వస్తున్నారని బాగానే ప్రచారం జరిగింది. ఇక రష్మీ,సుధీర్‌లు ‘ఢీ జోడి,జబర్థస్త్ ప్రోగ్రామ్‌లలో యాంకరింగ్ చేస్తు అలరిస్తున్నారు.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?