త్వరలోనే సుడిగాలి సుధీర్ పెళ్లి .. అమ్మాయి ఎవరంటే..?

Sudigali Sudheer Getting Married Soon
Sudigali Sudheer Getting Married Soon

సుడిగాలి సుధీర్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ఎంతోమంది ప్రేక్షకులను అలరించే సుడిగాలి సుదీర్ కు ఎంతో క్రేజ్ ఉంది. బుల్లితెరపై కమెడియన్ గా, యాంకర్ గా చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అదేవిధంగా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటిస్తున్న సుడిగాలి సుధీర్ వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే సుధీర్ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

ఇక బుల్లితెరపై ఎంతో క్రేజ్, పాపులారిటీని సంపాదించుకున్న జంటలలో యాంకర్ రష్మి-సుధీర్ జంట ఒకటి అని చెప్పవచ్చు. ఈ జంట బుల్లి తెరపై కనిపిస్తే చాలు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ జంట మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకేనేమో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు.. పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది.

తాజాతా సుధీర్ వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయ్యాడట. త్వరలోనే సుధీర్ పెళ్లి జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల ‘గాలోడు’ సినిమా తో సుధీర్ మంచి విజయాన్నిఅందుకున్నాడు. దీంతో, సుధీర్ కు హీరోగా మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి.