యాంకర్ రష్మీ జబర్థస్త్ ప్రొగ్రామ్ ద్వారా బాగానే ఫేమస్ అయింది. ఈ షో తరువాత ఆమెకు పలు షోలతో పాటు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. సినిమాలలో అయితే ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంది రష్మీ. ఆమె అందాల కోసమే సినిమాకు వెళ్లేవారు ఉన్నారంటే అర్థం చేసుకోవాలి అమ్మడు అందాల ఆరబోత ఎలా ఉంటుందో. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది రష్మీ. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. తాజాగా ఆమె అభిమాని అడిగిన ప్రశ్నకు కౌంటర్ ఇచ్చింది. ఆ వ్యక్తి రష్మీని ఎయిర్‌పోర్టులో కలిసే ప్రయత్నం చేయగా ,ఆమె దురుసుగా, పొగరుగా ప్రవర్తించిందట.
దీనిని రష్మీతో చెబుతు ..నిన్న విమానాశ్రయంలో రష్మిని కలిశా. మీ ప్రవర్తన దురుసుగా ఉంది. చాలా పొగరుగా ప్రవర్తించారు.ఇది భవిష్యత్తుకు మంచిది కాదని ఆ అభిమాని రష్మీకి సలహా ఇచ్చాడు. అభిమానికి సమాధానం ఇస్తు ఘాటుగానే స్పందించింది రష్మీ. 24 గంటల ప్రయాణం చేసి,మూడు విమానాలు మారాను.అందుకే అంత దురుసుగా, పొగరుగా ప్రవర్తించి ఉంటాను.అందులో నా తప్పు కూడా ఉంది. కాని మీరు అలా ప్రవర్తించకూడదు. ఇక నా కెరీర్ గురించి మీరు బాధపడల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడూ బాగుంటాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపింది.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ