జబర్దస్త్ కు పోటీ ఇచ్చేందుకు జీ తెలుగు వారు ‘అదిరింది’ కామెడీ షోను ప్రారంభించిన విషయం తెలిసిందే. జబర్దస్త్ స్థాయిలో అదిరిందికి టీఆర్పీ రేటింగ్ రావడం లేదు. కానీ నిర్వాహకులు డీలా పడకుండా నెట్టుకొస్తున్నారు.
అంత బానే ఉంది అనుకున్న టైంలో మొన్నటి వారం ఎపిసోడ్ లో ఆశ్చర్యకరంగా యాంకర్ సమీరా ప్లేస్ లో రవి మరియు భానులు వచ్చారు. అసలు సమీరాను ఎందుకు తీసేసారు అనే దానిపై రకరకలుగా వార్తలు వచ్చాయి. ఆమద్య పెళ్లి చేసుకున్న సమీరా ప్రస్తుతం గర్బవతి అని.. అందుకే ఆమె తప్పుకున్నట్లుగా ప్రచారం మొదలైంది. ఇంకా రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్న క్రమంలో సమీరా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరింది షో నుండి తాను తప్పుకోవడానికి గల కారణం చెప్పుకొచ్చింది. తనకేమి సమాచారం ఇవ్వకుండానే షో నుండి తప్పించారని.. నేను మీడియాలో చూసిన తర్వాత ఆశ్చర్య పోయానని అన్నారు.
నన్ను తొలగించినా కూడా నాకు అదిరింది షో అంటే చాలా అభిమానం కనుక చూస్తూనే ఉంటాను. ఇక తాను ప్రెగ్నెంట్ అంటూ వచ్చిన వార్తలను కూడా ఆమె కొట్టి పారేసింది. వారు తీసేయడం వల్లే తాను అదిరింది నుండి తప్పుకున్నాను అంతే తప్ప నా అంతట నేను షో నుండి తప్పుకోలేదు అంది. ఇక 26 ఎపిసోడ్స్ కు గాను ఒప్పందం కుదుర్చుకున్నారని.. కానీ పది ఎపిసోడ్స్ కు నన్ను తొలిగించారని చెప్పింది. జబర్దస్త్ ను కొట్టేందుకు అదిరింది షో రకరకల మార్పులు చేస్తోంది.
