Tuesday, May 21, 2024
- Advertisement -

‘అంధగాడు’ ద‌ర్శ‌కుడు రెండో సినిమాకు సిద్ధం

- Advertisement -

మొద‌టి ప్ర‌య‌త్నం క‌దా బెడిసి కొట్టొచ్చు.. దాని నుంచి పాఠాలు నేర్చుకొని రెండో సినిమాను ప‌క్క‌గా తీసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు ‘అంధగాడు’ ద‌ర్శ‌కుడు వెలిగొండ శ్రీనివాస్. మొద‌టి సినిమా రాజ్‌త‌రుణ్‌తో ‘అంధగాడు’ తెర‌కెక్కించినా ఆ సినిమా సక్సెస్ సాధించలేకపోయింది. నష్టాలను మిగల్చినా దర్శకుడిగా శ్రీనివాస్ కామెడీగా డీల్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. ద‌ర్శ‌కుడిగా కొన‌సాగే అవ‌కాశం ఉండ‌డంతో ప్ర‌స్తుతం శ్రీనివాస్ రెండో సినిమా కోసం స‌ర్వం సిద్ధం చేసుకుంటున్నాడు.

తన త‌ర్వాతి సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ దాదాపుగా సిద్ధం చేసేశాడు. ఆ స్ర్కిప్ట్‌కు తుది రూపు ఇచ్చేసి రొమాంటిక్ కామెడీ జోనర్‌లో సినిమా తీసే ఆలోచ‌న‌లో ఉన్నాడు. స్క్రీన్ ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నాడు డైరెక్టర్. ఎవరూ ఊహించని స్థాయిలో స్క్రీన్ ప్లే ఉంటుందని.. స్టోరీ మొత్తం తెలిశాక ప్రేక్ష‌కుడు ఎంజాయ్ చేసేలా సినిమాను తీయాల‌ని ప‌క్కాగా ఉన్నాడు. తన రెండో సినిమాను కూడా అనిల్ సుంకర నిర్మాణంలోనే రూపొందించబోతున్నట్లు శ్రీనివాస్ చెప్పాడు.

అనిల్ సుంక‌ర‌తో శ్రీనివాస్ మ‌ధ్య మంచి స్నేహం కుద‌ర‌డంతో మళ్లీ సక్సెస్‌ను రిపీట్ చేయాలనే ఆలోచ‌న‌లో యువ ద‌ర్శ‌కుడు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -