Tuesday, April 30, 2024
- Advertisement -

వివాదాల్లో చిక్కుకున్న కల్కి సినిమా

- Advertisement -

‘పిఎస్వి గరుడ వేగా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ ఇప్పుడు ‘కల్కి’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. అయితే తాజాగా కార్తికేయ అనే ఒక రైటర్ ‘కల్కి’ సినిమా కథ తాను రాసుకున్నదని ప్రశాంత్ వర్మ తన కథను కాపీ కొట్టారని ఈ మధ్యనే ఫార్మ్ అయిన కథ హక్కుల వేదిక లో కంప్లైంట్ ను నమోదు చేశారు.

ఒకవైపు రాజశేఖర్ మరియు బృందం కథ హక్కుల వేదిక ఇప్పటికే తమకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటూ వార్తలను బయటకు వినిపిస్తున్నప్పటికీ, మరోవైపు కథ హక్కుల వేదిక ఇంకా సినిమాను చూడలేదని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ రాసుకున్న కథ మరియు కార్తికేయ రాసుకున్న కథను చదివి కథ హక్కుల వేదిక ఈ రెండిటి మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయేమో ఇంకా చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కథ హక్కుల వేదిక నుంచి తనకు న్యాయం జరగకపోతే తాను కోర్టుకు సైతం వెళ్లి సినిమా విడుదల కాకుండా అడ్డుకోవడానికి కూడా సిద్ధం అని అంటున్నారు కార్తికేయ. మరి ఈ సమయంలో ‘కల్కి’ సినిమా విడుదల సాఫీగా సాగుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -