మెగా హీరో వరుణ్ తేజ్ మంచి జోష్‌లో ఉన్నాడు. రెండు వరుస హిట్లు సాధించాడు వరుణ్ తేజ్. ఫిదా, తొలిప్రేమ సినిమా హిట్లతో లైన్లోకి వచ్చాడు. తాజాగా వరుణ్ తేజ్ అంతరిక్షం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్,ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో తొలిసారిగా ‘అంతరిక్షం’ నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో అందరికి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. పైగా ఈ సినిమాకు ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించడంతో సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. సినిమా ఇప్పటికే దుబాయ్ అమెరికాలలో షోలో పడ్డాయాని సమాచారం అందుతుంది. ట్విట్టర్ ద్వారా మనకు అందుతున్న సమాచారం ప్రకారం సినిమా మొదటి భాగం మామూలుగానే ఉందని తెలుస్తుంది. అంతరిక్షంలో ఓ ప్రయోగం నిమిత్తం హీరో ,హీరోయిన్లు అక్కడికి వెళ్తారట.
అసలు సినిమా రెండో భాగంలోనే మొదలు అవుతుందని ప్రాథమికంగా తెలుస్తుంది. సినిమా కథ మొత్తం అంతరిక్షం చూట్టునే సాగుతుంది. సినిమాలో పెద్దగా కామెడీకి అవకాశం లేదు. హీరోయిన్స్‌కు కూడా నటించడానికి పెద్దగా ఏం లేదని తెలుస్తుంది. అసలు సినిమాలో సాంగ్స్ ఉన్నాయా ? అనే అనుమానం కలుగుతుంది. కాని నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకునేలా ఉంది. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే అతని నటన సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందట.తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడని తెలుస్తోంది. ఘాజీ లాంటి గ్రిప్పింగ్ కథనే అంతరిక్షం సినిమాకు కూడా రాసుకున్నాడు సంకల్ప్ రెడ్డి. ఈ సినిమాతో మరోసారి తన పేరు వెలుగులోకి రావడం ఖాయం అని అంటున్నారు సినిమా చూసినవారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన సమచారం మేరకే సినిమా ఇలా ఉంది అంటే ,రెండు తెలుగు రాష్టాలలో విడుదలైతే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. పూర్తి రివ్యూ కోసం చూస్తునే ఉండండి ఆద్యా న్యూస్.
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?