- Advertisement -

అనుపమ ‘పరదా’ రిలీజ్ డేట్!

- Advertisement -

సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. రాజ్ ఇటీవల ‘శుభం’ సినిమాతో సమంతతో కలిసి బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ యత్ర నార్యస్తు అనే పాటను కూడా లాంచ్ చేశారు. ‘పరధ’ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అనుపమ పరమేశ్వరన్ సాంప్రదాయ చీరలో కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో దేవత విగ్రహం ఆధ్యాత్మిక, ఎమోషనల్ కోర్ ని యాడ్ చేసింది. గోపి సుందర్ అద్భుతంగా స్వరపరిచిన యత్ర నార్యస్తు మహిళల బలం, దైవత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే ట్రాక్. మహిళల శక్తిని, పవిత్రతను స్ఫూర్తిదాయకంగా చూపిస్తూ.. దైవత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది. వినిపించే ప్రతి లైన్ వెనక ఓ బలమైన భావం వుంది. వనమాలి రాసిన అర్థవంతమైన పదాలు, అనురాగ్ కులకర్ణి వోకల్స్.. పాటను భావోద్వేగాలతో నింపేస్తాయి.

పాటలో కనిపించే సన్నివేశాలు ఎంతో మనసుని కదిలించేలా వున్నాయి. తెలుపు చీర కట్టుకున్న అనుపమ పాత్రపై గ్రామస్తులు ఓ బాధాకరమైన సంప్రదాయాన్ని అమలు చేస్తారు. ఆమె కుటుంబం బాధతో కనిపిస్తుంది. ఈ సీన్ మహిళలు ఎదుర్కొంటున్న సమాజపు సమస్యల్ని స్పష్టంగా చూపిస్తూ, సినిమాకి భావోద్వేగతతో కూడిన టోన్‌ను ప్రజెంట్ చేస్తోంది. పరదా సినిమా సంచలనకరమైన కథను చెప్పబోతుందని టీజర్, పాట, ప్రమోషన్స్ చూస్తే అర్థమవుతోంది. ఫస్ట్ సాంగ్, గ్లింప్స్, మిగతా ప్రమోషనల్ మెటీరియల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రాఫర్‌గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -