హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ,మాళయాళ భాషలలో నటిస్తుంది అనుపమ. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది అనుపమ. ఎప్పటికప్పుడు తన సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అనుపమ తనకు ఎలాంటి మనిషిని పెళ్లి చేసుకోవాలని ఉందో చెప్పుకొచ్చింది. తాను సిగ్గుపడుతున్నట్టు ఉన్న ఓ ఫోటోతో పాటూ తాను ఇష్టపడే అబ్బాయికి కావాల్సిన క్వాలిటీలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
చూడడానికి బ్యాడ్ బోయ్‌లా ఉన్నా సరే.. మహిళలను రాణిలా చూసుకునే అబ్బాయంటే ఇష్టమని అనుమప తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా దర్శకుడు పవన్ వడయార్ తెరకెక్కిస్తున్న ‘నట సార్వభౌమ’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం అనుపమ చేతిలో తెలుగులో ఒక్క సినిమా కూడా లేదని తెలుస్తుంది.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?
- ఈవారం థియేటర్ సినిమాలివే!