Saturday, April 27, 2024
- Advertisement -

రింగుల జుట్టుతో ఫ్యాన్స్ ని రింగులోకి దించేస్తున్న అమ్మడు.. నువ్వలా చేస్తే కుర్రాళ్ల పరిస్థితి ఏంటి అనుపమ..!

- Advertisement -

ప్రేమం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా ఆ సినిమా కన్నా ముందు అ ఆ తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది అనుపమ పరమేశ్వరన్. కెరీర్ మొదట్లో స్టార్ ఛాన్స్ లు అందుకోవాలని అనుకున్న అమ్మడు చివరి నిమిషంలో చేజార్చుకుంది. అయితే స్టార్ ఛాన్స్ లు రాకపోయినా టైర్ 2 హీరోలతో సినిమాలు చేస్తూ వస్తుంది అనుపమ. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తుంది అమ్మడు.

దీనితో పాటుగా రవితేజ ఈగల్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ రెండు సినిమాలు అనుపమకి హిట్ అందిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రకరకాల హెయిర్ స్టైల్స్ తో అనుపమ అదరగొట్టేస్తుంది. లేటెస్ట్ గా డార్క్ బ్లూ కలర్ డ్రెస్ లో రింగుల జుట్టుతో కుర్రాళ్లని తన మాయలో పడేసేలా చేస్తుంది అమ్మడు.

రింగుల జుట్టుతో రింగులోకి దించేలా చేస్తున్న అనుపమ ప్లాన్ బాగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. సిన్మాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంటుంది అమ్మడు. న్యాచురల్ బ్యూటీ న్యాచురల్ గ్లామర్ ని ఆమె ఫాలోవర్స్ కూడా తెగ ఇష్టపడుతున్నారు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం అనుపమ హంగామా కొనసాగుతూనే ఉంది. టిల్లు స్క్వేర్ సినిమా ఆగష్టులో వస్తుండగా రవితేజ ఈగల్ మాత్రం 2024 సంక్రాంతికి టార్గెట్ పెట్టుకున్నారు. సో అనుపమ కూడా వరుస క్రేజీ ప్రజెక్ట్ లతో ఆడియన్స్ ని అలరిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -