Friday, May 17, 2024
- Advertisement -

హ‌ర‌ర్ కాకుండా ల‌వ్‌ట్రాక్‌లో ‘భాగ‌మ‌తి’

- Advertisement -

హీరోయిన్‌ల‌లో సూప‌ర్‌స్టార్ స్వీటీ అనుష్క‌. అరుంధ‌తి నుంచి మొద‌లుకొని రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి, భాగ‌మ‌తి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్‌గా ముద్ర ప‌డిన జేజ‌మ్మ ఇప్పుడు ఓ ప్రేమ కథా సినిమాలు తీసే ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌నుంది. ఇక హ‌ర‌ర్ కాకుండా ఓ మంచి ల‌వ్‌స్టోరీ సినిమాతో అనుష్క మ‌న ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ప్రేమ క‌థా చిత్రాల‌కు పెట్టింది పేరుగా ఉన్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ వాసుదేవ్‌. అత‌డు తీసే సినిమాలు అన్నీ ప్రేమ‌కావ్యాలే. ఈ ద‌ర్శ‌కుడి చేతిలో అనుష్క న‌టిస్తోంద‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం బొద్దుగా ఉన్న అనుష్క బ‌రువు త‌గ్గే ప‌నిలో ప‌డింది. బ‌రువు త‌గ్గిన త‌ర్వాత గౌత‌మ్‌కు డేట్స్ ఇవ్వ‌నుంది. ఈ సినిమా తెలుగు, త‌మిళంలో రూపొందించ‌నున్నారు. గౌత‌మ్ మీన‌న్ ఈ సినిమాను ఓ డ్రీమ్ ప్రాజెక్ట్‌లా భావించి రూపొందించే ప‌నిలో ఉన్నాడ‌ని స‌మాచారం

ఘ‌ర్ష‌ణ‌, సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ వంటి సినిమాల ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ మ‌రీ అనుష్క‌ను ఏ పాత్ర‌లో చూపిస్తారో.. అనుష్క‌ను ల‌వ్‌ట్రాక్‌లో ప‌డేస్తాడో కొన్నాళ్లు వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -