- Advertisement -
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చిట్టిబాబు మానియా నడుస్తోంది. మెగా అభిమానులతోపాటు సగటు సినిమా ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘రంగస్థలం’ నేడు (మార్చి 30న) థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో మెగా అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు.
ఇదిలా ఉంటే రామ్‌చరణ్‌కు ప్రముఖ సినీ నటుడు అరవిందస్వామి బెస్ట్ విషెస్ చెప్పారు. ‘ఈ సినిమా గురించి ఇప్పటికే మంచి విషయాలు వింటున్నా. రామ్ చరణ్ కు, మొత్తం టీమ్ కు ఆల్ ది వెరీ బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ సినిమాలో అరవిందస్వామి ప్రతి నాయకుడి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.
Hearing good things already! Wishing ‘Mega Power Star’ #RamCharan and the entire team all the very best! pic.twitter.com/6XSPT0VDyF
— arvind swami (@thearvindswami) March 30, 2018