- Advertisement -

ఓటీటీలోకి అర్జున్ ‘బ్లాస్ట్’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు

- Advertisement -

సీనియర్ యాక్షన్ హీరో అర్జున్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, త్వరలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘బ్లాస్ట్’ చిత్రం జూన్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై వస్తున్న ఊహాగానాలకు ఇప్పుడు తెరపడింది. సుభాష్ కె. రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్‌తో పాటు ప్రీతీ ముకుందన్, అభిరామి, అర్జున్ చిదంబరం కీలక పాత్రలు పోషించారు.

నీల (ప్రీతీ ముకుందన్) కరాటేలో ప్రావీణ్యం ఉన్న మధ్యతరగతి అమ్మాయి. ఆమె తండ్రి రాజారామ్ (అర్జున్), తల్లి (అభిరామి) కూడా కరాటే మాస్టర్లు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇస్తూ, మెడికల్ షాపు నడుపుకుంటూ ఆ కుటుంబం సాఫీగా జీవిస్తుంటుంది. అయితే, అనుకోకుండా నీల ఎదుర్కొన్న ఒక ఘటన ఆ కుటుంబం చిక్కుల్లో పడేలా చేస్తుంది. ఒక రౌడీని నీల దెబ్బతీయడంతో, కృపాకర్ గ్యాంగ్ మరియు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్రహం (అర్జున్ చిదంబరం) ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారు.

అసలు కృపాకర్ గ్యాంగ్ నీల కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? వారు ఆ గండం నుండి ఎలా బయటపడ్డారు? అన్నదే ఈ సినిమా కథ. యాక్షన్ సన్నివేశాలు, అర్జున్ మార్క్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో చూడని వారు ఈ నెల 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ యాక్షన్ డ్రామాను ఆస్వాదించవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -