Saturday, May 11, 2024
- Advertisement -

మహేష్ రక్తం లోనే వ్యవసాయం ఉందట…!

- Advertisement -

మహేష్ బాబు తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి మహర్షి చిత్రాన్ని విజయ పథం లోకి నడిపించాడు. మొదలు పెట్టినప్పటి నుండి విడుదల వరకు ప్రతి దశ లో ఈ సినిమా విజయం సాధింస్తుంది అనే నమ్మకం తో పని చేసిన చిత్ర యూనిట్ ప్రస్తుతం విజయాన్ని గర్వంగా ఆస్వాదిస్తోంది. నిన్న నే ఈ సినిమా కి సంబందించిన సక్సెస్ మీట్ ని కూడా చాలా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేశారు దర్శక నిర్మాతలు. కాలర్ ఎగరేసి మరి తన విజయ గర్వాన్ని మహేష్ ప్రదర్శించారు.

ఈ సందర్భంగా సినిమా నిర్మాతల్లో ఒకరైన అశ్విని దత్ మాట్లాడుతూ మహేష్ కి రైతులకి సంబందించిన ఒక ఆసక్తికర విషయాన్నీ చెప్పారు. “మహేష్ తండ్రి, అంటే కృష్ణ గారు చాలా సినిమాల్లో వ్యవసాయాన్ని బాక్గ్రౌండ్ గా ఎంచుకొని విజయం సాధించారు. ఆయన రైతు పాత్ర వేసి చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో అనేక సినిమాలు పెద్ద విజయం సాధించాయి. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, కృష్ణ గారి తల్లి నాగ రత్నమ్మ గారు ఒక రైతు గా ఆవిడ ఎన్ని కష్టాలు అనుభవించిందో చెప్పారు. ఆవిడ ఒక విజయవంతమైన రైతు. అలా మహేష్ రక్తం లో నే వ్యవసాయం ఉంది.” అని ఆయన అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -