Thursday, May 8, 2025
- Advertisement -

జగన్‌ నాకు మంచి ఫ్రెండ్!

- Advertisement -

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు నిర్మాత అశ్వినీదత్. కల్కి సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు అశ్వినీ దత్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన…ఇంత పెద్ద సినిమా ప్రాజెక్టును పెట్టుకొని ఎన్నికలకి ముందు బలంగా మీ వాదనను ఎలా వినిపించారని అడగ్గా.. జగన్ మోహన్ రెడ్డి విషయంలో తాను ఎక్కడా డిఫర్ అవ్వలేదు అన్నారు. నాతో చాలా ఫ్రెండ్లీగానే ఉండేవారని… మా రెండో అమ్మాయి పెళ్లికి కూడా వచ్చారని చెప్పారు.

తన అల్లుడు నాగ్ అశ్విన్ గురించి మాట్లాడుతూ.. మా ఇంటికి వస్తాడా.. గబగబా చెప్పులు బయట విప్పేసి లోపలికి వస్తాడు… వెళ్తూ వెళ్తూ నా చెప్పులు కనిపిస్తే అవేసుకొని బయటికెళ్లిపోతాడని ఫన్నీగా చెప్పారు. చేసే పనిమీద తప్ప ఇలాంటి సిల్లీ విషయాలు పట్టించుకోడన్నారు అశ్వినీదత్. కల్కి సెకండ్ పార్టు రెడీగా ఉందని వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తామని చెప్పారు.

వైజయంతీ మూవీస్ నిర్మించిన సినిమాల్లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వెరీ స్పెషల్. ఇప్పటికీ ఆ సినిమా గురించి దాన్ని రిలీజ్ చేసిన సందర్భం గురించి తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది అని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -