Wednesday, May 15, 2024
- Advertisement -

జెర్మనీ లో బాహుబలి

- Advertisement -

బాహుబలి ఇప్పటికే అనేక దేశాల్లో విడుదలై ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఇంటర్నేషనల్ గా కూడా అనేక దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఎక్కడికక్కడ లోకల్ వెర్షన్స్ ను సిద్దం చేసి రిలీజ్ చేస్తుండడం విశేషం. ఇప్పుడు జర్మనీలో కూడా స్థానిక భాషలో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.

ఫిబ్రవరిలో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ జర్మన్ ట్రైలర్ అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు వెర్షన్ ట్రైలర్ కు – జర్మన్ ట్రైలర్ కు చాలానే వేరియేషన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కట్ చేసిన ఈ ట్రైలర్.. అక్కడి ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అయింది. రిలీజ్ కోసం కూడా అక్కడి జనాలు ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారన్నది జర్మన్ డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ ఫిలిం సెలెక్ట్ అంటోంది. 

ఏప్రిల్ 28న జర్మన్ బాహుబలిని విడుదల చేయబోతున్నారు. మొదట 14నే విడుదల చేయాలని భావించారు కానీ.. స్థానిక కారణాలతో రెండు వారాలు వాయిదా వేశారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -