Friday, May 3, 2024
- Advertisement -

ఫేక్ అలర్ట్ ని ఇచ్చిన బాహుబలి నిర్మాతలు

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ఆర్కా మీడియా వర్క్స్ పేరున్న సంస్థ. బాహుబలి సినిమా నిర్మాణం తో ఒక్కసారిగా సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే వారి పేరు వాడుకొని సోషల్ మీడియా లో కొంత మంది మోసం చేయాలని చూస్తున్నారు. ఈ విషయమై వారు ఒక ప్రకటన చేశారు.

“మా పేరు మీద ఒక కాస్టింగ్ కాల్ క్రియేట్ చేసి,ఒక ఫేక్ ఇమెయిల్ ని కూడా యాడ్ చేసి ఒక ప్రకటన ని విడుదల చేశారు. అది సోషల్ మీడియా లో ప్రచారం లో ఉంది అని తెలుస్తుంది. అయితే ఇది పూర్తిగా అవాస్తవం. మేము అటువంటి ప్రకటన అస్సలు ఇవ్వలేదు. ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఏదో దురుదేశ్యం దీని వెనుక దాగి ఉంది. అయితే ఇలాంటి పనులు చేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే ఫేక్ ఈమెయిల్స్ మరియు ఫేక్ లెటర్స్ ని నమ్మకండి. మేము సైబర్ క్రైం సెల్ ని అప్రోచ్ అయ్యాము. ఇక పై ఏ విధమైన సమాచారం అయినా మేము మా అధికారిక సోషల్ మీడియా ఛానెల్స్ నుండే ఇస్తాము. సంప్రదింపులు కూడా మా ఛానెల్స్ నుండే జరుగుతాయి.” అని వారు పేర్కొన్నారు.

బాహుబలి రెండు భాగాలు మాత్రమే కాకుండా ఈ నిర్మాతలు వేదం, మర్యాద రామన్న మరియు ఇంకొన్ని చిత్రాలని కూడా నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -