Thursday, May 16, 2024
- Advertisement -

బాహుబలి తొలివారం కలెక్షన్ల పూర్తి వివరాలు ఇవిగో..!

- Advertisement -

నూటా అరభై కోర్టు అన్నారు.. రెండువందల కోట్ల రూపాయల మార్కును దాటిందన్నారు.. మరి ఇంతకీ బాహుబలి తొలివారం వసూళ్ల అసలు కథ ఏమిటి? ఈ సినిమా ఏపీ లెవల్లో ఎంత వసూలు చేసింది.

తెలుగు వెర్షన్ తో ఎంత షేర్ ను సాధించింది? అనే విషయం ఆసక్తికరంగా ఉంది. మొన్నటి శుక్రవారంతోనే బాహుబలి సినిమా వారంను పూర్తి చేసుకొంది. ఇలాంటి నేపథ్యంలో ఆ సినిమా కలెక్షన్ల వివరాల గురించి పరిశీలిస్తే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

నైజాం ఏరియాలో ఈ సినిమా 22.54 కోట్ల రూపాయల షేర్ ను సాధించినట్టుగా తెలుస్తోంది. సీడెడ్ లో 12 కోట్ల రూపాయల మొత్తం నిర్మాతకు దక్కింది. నెల్లూరు జిల్లాలో 2.25 కోట్ల రూపాయలు వసూలయినట్టుగా తెలుస్తోంది. గుంటూరులో 5.48 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.65 కోట్ల రూపాయల షేర్ దక్కింది. ఉభయగోదావరి జిల్లాల్లో కలిపి పది కోట్ల రూపాయల మొత్తం వసూలయినట్టుగా తెలుస్తోంది. వైజాగ్ లో ఈ సినిమా 5.53 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.

మొత్తంగా బాహుబలి తెలుగు వెర్షన్ 60 కోట్ల రూపాయల మొత్తాన్ని తొలివారంలోనే సంపాదించేసుకొంది. ఇక శాటిలైట్ రైట్ రైట్స్.. మిగతా రోజుల్లో లభించబోయే వసూళ్లు నిర్మాతను ఒడ్డున పడేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -