విక్రమ్ హీరోగా ‘దైవ తిరుమగళ్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగులో ఈ సినిమా ‘నాన్న’ పేరుతో రిలీజ్ అయ్యింది. ఫిజికల్లి ఛాలెంజ్డ్ కృష్ణ పాత్రలో విక్రమ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో అతని కూతురు వెన్నెల పాత్రలో సారా అనే పాప నటించింది. ఏ.ఎల్.విజయ్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం పర్వాలేదు అనిపించింది.
అనుష్క, అమలా పాల్, సంతానం.. వంటి వారు కూడా కీలక పాత్రలు కూడా పోషించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 9 ఏళ్ళు దాటింది. ఆ సినిమాలో పాపగా నటించిన సారా అర్జున్ వయసు అప్పటికి ఐదేళ్ళు కాగా… ఇప్పుడు 14 ఏళ్ళు. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా కూడా నటించడానికి రెడీ అయిపొయింది. అవును ఇప్పుడు సారా ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అటు తమిళంలో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా అనేక సినిమాల్లో నటించింది సారా.
ఈమె తెరంగేట్రం చేసింది కూడా బాలీవుడ్ చిత్రంతోనే కావడం విశేషం. ‘404’ అనే హిందీ చిత్రంతో ఈమె ఎంట్రీ ఇచ్చింది. అయితే పేరు తెచ్చిపెట్టిన తమిళ ఇండస్ట్రీని కూడా ఈమె విడిచి పెట్టను అని చెబుతుంది. ఈమె సొంత ఊరు ముంబై అయినప్పటికీ తమిళంలో బిజీగా గడుపుతుంది. త్వరలో హీరోయిన్ గా కూడా ఈమె నటించడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
