- మోహన్‌బాబుతో బాలకృష్ణ మాటాముచ్చట
నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్‌బాబు ఒకచోటకు చేరారు. ఇద్దరు కలిసి ముచ్చట్లాడుకున్నారు. అనుకోని అతిథితో చిత్రబృందం ఆశ్చర్యానికి గురైంది. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గాయత్రి’. మంచు విష్ణు పుట్టినరోజు, మోహన్‌బాబు సినీ ప్రస్థానం మొదలై 42 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇటీవల ఆ సినిమా టైటిల్ లోగోను విడుదల చేశారు. కాగా ఇందులో విష్ణు కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ట్విటర్‌తో పంచుకున్నారు. ఈ సినిమా సెట్‌లో నందమూరి బాలకృష్ణ వచ్చినట్లు చెబుతూ ఆనందం వ్యక్తం చేశాడు
‘ఇవాళ్టి నుంచి ‘గాయత్రి’ షూటింగ్‌లో పాల్గొంటున్నా. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, మా అన్న బాలకృష్ణ సెట్‌కు వచ్చారు. నన్ను ఆశీర్వదించి, మాతో చాలా సమయం ఉన్నారు’ అని విష్ణు హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.
కొత్త దర్శకుడు ఆర్. మాధవ్ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా తీస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అనసూయ, నిఖిలా విమల్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. . డైమండ్ రత్నబాబు కథ మాటలు అందించారు. ఇటీవల చిత్ర రంగానికి ప్రవేశించి 42 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు మోహన్‌బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
https://www.youtube.com/watch?v=v1EmSCQJnGs