నందమూరి హీరో బాలకృష్ణ.. ఇటివలే పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. పుట్టిన రోజు సందర్భంగా.. బాలయ్యకు ఆయన కూతుళ్లు బెంట్లే కారు గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కాస్ట్ లీ కారు కోసం ఫ్యాన్సీ నెంబర్ కూడా రెడీ అయిపోయింది. భారీ మొత్తాన్నే చెల్లించి నెంబర్ సొంతం చేసుకున్నారు నందమూరి హీరో బాలకృష్ణ.
{loadmodule mod_custom,GA1}
తాజాగా హైదరబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఫ్యాన్సీ నెంబర్ల వేలం జరిగింది. ఆక్షన్ ద్వారా ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ కు భారీగానే ఆదాయం సమకూరగా.. ఈసారి అందులో బాలయ్య వాటా కూడా గట్టిగానే ఉంది. మొత్తం 30లక్షల రూపాయల ఆదాయం వస్తే.. అందులో బాలయ్య వాటానే పాతిక శాతం పైగా ఉంది. బాలయ్య తన కొత్త కారుకు నెంబరు కోసం ఏకంగా 7.77 లక్షల రూపాయలు చెల్లించడం విశేషం. “TS 09 EU 0001” నెంబర్ ను.. తన కొత్త బెంట్లే కారు కోసం గెలుచుకున్నారు నందమూరి బాలకృష్ణ. కాస్ట్ లీ కారు.. గిఫ్ట్ గా ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డారట బాలయ్య. తనపై కూతుళ్లు చూపిస్తున్న ప్రేమకు బాలయ్య ఏం ఇచ్చిన తక్కువే అనేశాడట. పుట్టిన రోజున కూతుళ్లు బాలయ్యకు షాక్ ఇస్తే.. ఇప్పుడు అందరికి బాలయ్య షాక్ ఇచ్చారు.
{loadmodule mod_custom,GA2}
ఇక బాలయ్య కొత్త సినిమా విషయంకు వస్తే.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందుతున్న బాలకృష్ణ 101వ సినిమాకి పైసా వసూల్ అంటూ టైటిల్ ను ఫైనల్ చేయగా.. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. బాలయ్య కొత్త లుక్ లో సూపర్ గా ఉన్నారని ఫ్యాన్స్ ఇప్పటికే సంబరాలు చేసేసుకుంటున్నారు.
{youtube}Gn5cNeTjr9w{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related