Wednesday, May 7, 2025
- Advertisement -

బాలయ్య బాబు అభిమానులకు పండుగ

- Advertisement -

నందమూరి అందగాడు బాలక్రష్ణ కొత్తసినిమా గౌతమి పుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. శుక్రవారం నాడు బాలక్రష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ పోస్టర్ ను విడుదల చేశారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బాలక్రష్ణ స్ధాయిని పెంచుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బాలయ్య బాబు అభిమానుల అంచనాకు తగ్గట్టుగానే ఉంది.

ఈ పోస్టర్లో చిత్ర యూనిట్ కు సంబంధించిన వారందరి పేర్ల చివర పుత్ర జోడించడం విశేషం. బాలక్రష్ణను బసవరామతారక పుత్రగా , దర్శకుడు క్రిష్ ను అంజనా పుత్ర క్రిష్ గా, నిర్మాతలను కమలాపుత్ర రాజీవ్ రెడ్డి, సీతారామపుత్ర సాయిబాబా అని ముద్రించడం విశేషం. అలాగే ఈ సినిమాకు పనిచేస్తున్న సాంకేతిక నిపుణుల పేర్లకు కూడా ఈ పుత్ర తగిలించారు.

ఈ చిత్రం తొలి షెడ్యూల్ మొరాకోలో పూర్తి చేశారు. భారీ యుద్ధ నౌకతో వేసిన సెట్లో హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బాలయ్య బాబు అమెరికాలో ఉన్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను అమెరికాలోని ఆయన అభిమానుల సమక్షంలోనే జరుపుకుంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -