Sunday, May 19, 2024
- Advertisement -

బండ్ల గణేష్ నోరు విప్పాడు

- Advertisement -

గత కొద్దీ రోజులు గా సోషల్ మీడియా లో బండ్ల గణేష్ సెకండ్ ఇన్నింగ్స్ మీద విస్ప్రుత ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ జనసేన తరపున గాజువాక, భీమవరం లో పోటీ చేసి ఓడిపోవడం తో ఇక అందరూ పవన్ తిరిగి సినిమాల్లోకి వస్తాడు అనే ఆలోచన ని వెలిబుచ్చుతున్న తరుణం లో బండ్ల గణేష్ పవన్ తో సినిమా చేస్తాడు అనే వార్తలు విన్పిస్తున్నాయి. అంతే కాకుండా బండ్ల గణేష్ బోయపాటి శ్రీను కి అడ్వాన్స్ ఇచ్చి మరీ పవన్ కోసం ఒక కథని సిద్ధం చేయమని చెప్పారు అనే విషయం కూడా అందరూ చెప్తున్నారు.

ఈ వార్తలు సోషల్ మీడియా లో ఒకేసారి విపరీతం గా వైరల్ అవ్వడం, మెయిన్ స్ట్రీమ్ మీడియా లో ఉన్న వారు కూడా ఈ వార్త ని కవర్ చేయడం తో అంతా నిజమేనని భావించారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ కొత్త ఫోటోలు బయటకి రాగా,అదే సినిమా లో హీరో లుక్ అనే ప్రచారం కూడా సాగిపోయింది.

అయితే ఎట్టకేలకు బండ్ల గణేష్ ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. అసలు తాను తదుపరి చిత్రం పై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు అని, తాను చెప్పే వరకు ఏది నమ్మవద్దు అని అందరినీ కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -