Saturday, May 18, 2024
- Advertisement -

హ‌లీవుడ్‌కు పోటీగా బెంగాల్ సినిమా

- Advertisement -

హాలీవుడ్ సినిమాలు భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లో కూడా మ‌స్త్ ఆడుతాయి. మంచి హిట్లు కూడా సాధిస్తాయి. అవ‌తార్ సినిమా అయితే మ‌న సినిమా మాదిరిగా ఆద‌రించారు. ఆ త‌ర్వాత ఎన్నో సినిమాలు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాయి. ఆ గ్రాఫిక్స్‌, ఫైట్స్ వంటివి ఎంతో ఆక‌ట్టుకుంటాయి. అలాంటి హాలీవుడ్ స్థాయి సినిమాను మ‌న‌దేశ‌పోళ్లు తీస్తున్నారు. వారికే సాధ్య‌మా మేం కూడా తీస్తామ‌ని బెంగాల్ సినీ ప‌రిశ్ర‌మ నిరూపించింది. హాలీవుడ్‌కు త‌క్కువ కాకుండా ఓ సినిమాను తీస్తున్నారు. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం త‌క్కువ కాకుండా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా ట్రైల‌ర్ న‌వంబ‌ర్ 30వ తేదీన విడుద‌ల‌య్యింది. ఈ ట్రైల‌ర్ చూస్తే వావ్ అంటారు. అంత బాగా దృశ్యాలు తీశారు.

కమలేశ్వర్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బెంగాలీ చిత్రం ‘అమెజాన్‌ ఓబిజాన్‌’. తెలుగులో ‘అమెజాన్‌ అడ్వెంచర్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. హాలీవుడ్‌లో తీసే ఈ సినిమాను మ‌న దేశంలో బెంగాలీలో తీస్తున్నారు.

‘మా నాన్నగారు ఒక అన్వేషకుడు కావాలని కలలుగన్నారు. కానీ, ఆయన అన్వేషణ విఫలమైంది’ అంటూ ఓ లేడీ మాట్లాడుతూ ట్రైలర్ ప్రారంభ‌మైంది. బంగారు న‌గ‌రం కోసం హీరో అన్వేష‌ణ నేప‌థ్యంలో ఈ సినిమా ఉండ‌నుంది. ఎస్‌బీఎఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో మహేంద్రసోని, శ్రీకాంత్‌ మెహతా ఈ సినిమా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తీస్తున్నఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన థియేట‌ర్ల‌కు వ‌స్తోంది. ఈ సినిమాను బెంగాలీతోపాటు హిందీ, తెలుగు, తమిళ్‌, ఒరియా, అస్సామీ భాషల్లో విడుదల చేస్తారంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -