Tuesday, May 14, 2024
- Advertisement -

భలే మంచి రోజు అదరకొడుతోంది

- Advertisement -

క్రిస్మస్ రోజున విడుదల అయిన భలే మంచి రోజు సినిమా వారం అంతా మంచి కలక్షన్ లతో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన విషయం తెలిసిందే. ఈ కామెడీ థ్రిల్లర్ లో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. సినిమా కి పాజిటివ్ టాక్ రావడం తో పాటు ప్రేక్షకుల నుంచి మౌత్ టాక్ కూడా బాగుండడంతో.. సుధీర్ బాబు సినిమా కలెక్షన్లు కుమ్మేస్తోంది.

ఎంటర్టైన్మెంట్ ని ప్రధానంగా చూపించిన డైరెక్టర్ కిషోర్ పెద్ద విషయం లేకపోయినా సినిమాని లాగేసాడు. వీక్ డేస్ లో కలక్షన్ లు బాగా ఎక్కువగా ఉంటాయి రెండవ వీక్ ఎండ్ వచ్చినా కూడా ఈ సినిమా గట్టిగానే రాబడుతోంది అంటే ఈ మూవీ ఏ రేంజ్ హిట్ అని అర్ధం అవుతుంది. ముఖ్యంగా వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయంటే.. భలే మంచి రోజు ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో తెలుస్తుంది.

ఈ వారం కూడా భారీ చిత్రాలు లేకపోవడం.. హోప్స్ ఉన్న సినిమా రామ్ మూవీ నేను శైలజ మాత్రమే కావడంతో.. సెకండ్ వీక్ లోనూ భలే మంచి రోజు పెర్ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -