ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం భారతీయుడు 2. జూలై 12న తెలుగు,తమిళ,హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుండగా జూన్ 1న చెన్నైలో ఆడియో రిలీజ్ వేడుక ఘనంగా జరగనుంది.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయుడు 2 మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి.
1996లో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ విడుదలై బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా భారతీయుడు 2 రూపొందుతోంది. ఇప్పటికే ఇండియన్ 2 ఇంట్రో వీడియోతో పాటు రీసెంట్‌గా రిలీజ్ చేసిన శౌర అనే పాటకు సూపర్బ్ రెస్పాన్స్ రాగా తాజాగా చెంగల్వ చేయందేనా అనే సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.