Sunday, June 16, 2024
- Advertisement -

భారతీయుడు 2..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

శంకర్ – కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా భారతీయుడు 2 పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.

సినిమా నుండి విడుదలైన ‘శౌర..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. పాట‌లో చూపించిన కొన్ని విజువ‌ల్స్ చూస్తుంటే భార‌తీయుడు 2 అంచ‌నాల‌ను మించేలా శంక‌ర్ తెరకెక్కించార‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -