ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారతీయుడు 2 ట్రైలర్ వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో కమల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారతీయుడు జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో విశ్వరూపం చూపించారు కమల్. లంచగొండులపై స్వైర విహారం చేశారు.
ఊరారా ఇది.. చదువుకు తగ్గ జాబ్ లేదు.. జాబ్‌కు తగ్గ జీతం లేదు..కట్టిన ట్యాక్స్ తగ్గినట్లు సౌకర్యాలు లేవు..దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉన్నాడు, తప్పు చేస్తున్నవాడు తప్పు చేస్తూనే ఉంటాడు అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేయగా హీరో సిద్ధార్థ్ ..మనం ఒక్కొక్కరినీ తప్పు పడుతూనే ఉంటాం. సిస్టమ్ సరిగా లేదు. సరి చేయాలని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటాం. కానీ దాన్ని సరి చేయటానికి కొంచెం కూడా ప్రయత్నించటం లేదు అని చెబుతాడు.
సేనాపతిగా పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు కమల్. రెండో స్వాతంత్ర్య పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను అనే పవర్‌ఫుల్, ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. రవివర్మన్ సినిమాటోగ్రఫీ, అనిరుద్ సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాలను మరో లెవల్‌లో ఆవిష్కరించాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రైలర్‌ని చూస్తుంటే అర్ధమవుతోంది.