Saturday, April 27, 2024
- Advertisement -

కమల్..థగ్ లైఫ్‌లో నాని!

- Advertisement -

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా తొలుత ఈ సినిమాలో కీలక పాత్రకు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దుల్కర్ స్థానంలో నానిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

డేట్స్ స‌ర్ధుబాటుకాకపోవ‌డంతో దుల్కర్ ఈ క్రేజీ ప్రాజెక్టు నుండి బయటకు రావడంతో నానిని తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నాని సైతం మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయాలని భావించారు. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా దుల్కర్ రూపంలో నానికి అదృష్టం కలిసి వచ్చినట్లు తెలుస్తోంది.

పీరియాడిక‌ల్ యాక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో జ‌యం ర‌వి, త్రిష‌, జోజు జార్జ్‌, గౌత‌మ్ కార్తిక్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ కు ఇది 234వ సినిమా. ప్రస్తుతం కమల్ హాసన్ – శంకర్ కాంబోలో ఇండియన్ – 2 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. 1996లో రిలీజైన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఇండియ‌న్‌కు సీక్వెల్‌గా ఇండియన్ 2 వస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -