Saturday, May 10, 2025
- Advertisement -

బిగ్‌బాస్‌లో హ‌త్య‌లు చేస్తుంది ఎవ‌రో తెలుసా?

- Advertisement -

బిగ్‌బాస్ ఈ వారం మ‌ర్డ‌ర్ టాస్క్ న‌డుస్తుంది.బిగ్‌బాస్ హౌస్‌లో ప్ర‌స్తుతం ఎలిమినేష‌న్ త‌రువాత జ‌రిగే ల‌గ్జ‌రీ బడ్జెట్ టాస్క్ జ‌రుగుతుంది.హౌస్‌లో ప్ర‌తి ఒక్క‌రికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌.హౌస్‌లో మ‌ర్డ‌ర్స్ జ‌రుగుతాయి ,వాటిని క‌నిపెట్టాడానికి పోలీస్ ఆఫీస‌ర్‌గా రోల్ రైడా,సీఐడి ఆఫీస‌ర్‌గా గ‌ణేష్‌లను నియ‌మించింది బిగ్‌బాస్‌.హౌస్‌లో ముగ్గురు మ‌ర్డ‌ర్స్ జ‌రిగే లోగా వీరిద్ద‌రు ఆ మ‌ర్డ‌ర్స్ ఎవ‌రు చేస్తున్నారో తెలుసుకోవాలి.ఈ టాస్క్ చాలా బాగుండంతో హౌస్‌మెట్స్ అంద‌రు చాలా హూషారుగా పాల్గొన్నారు.మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలో మొద‌టి హ‌త్యకు శ్యామ‌ల గురైంది.

ఏం జ‌రిగిందో తెలుసుకునే లోపే కౌశ‌ల్ కూడా హ‌త్యకు గురైయ్యాడు.ఈ హ‌త్య‌లు ఎవ‌రు చేస్తున్నారు అనే అనుమానం హౌస్‌మెట్స్ అంద‌రిలోను మొద‌లైంది.అంద‌రు మొద‌ట అమీత్‌ను అనుమానిస్తారు.కాని అమీత్ అంద‌రి ముందు ఉండ‌గానే హౌస్‌లో మూడో హత్య జ‌రిగింద‌ని ప్ర‌క‌టిస్తాడు బిగ్‌బాస్‌.మ‌రి ఈ హ‌త్యలు ఎవ‌రు చేస్తున్నారో తెలియాలి అంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.ఇక గీతా మాధురికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ప్రకారం ఆమె కౌశ‌ల్‌తో గొడ‌వ పెట్టుకుంది.ఆమె క‌నుక ఈ సీక్రెట్ టాస్క్‌లో స‌క్సెస్ అయితే గీతా వ‌చ్చేవారం ఎలిమినేష‌న్‌లో ఉండద‌ని తెలుస్తుంది. మ‌రో నెల లోపు బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ముగియ‌నుంది.దీంతో ఎలిమినేష‌న్స్‌పై మ‌రింత ఆస‌క్తి నెల‌కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -