తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు కౌశల్. అతను విన్నర్‌గా నిలవడంలో ఆయన పేరిట ఏర్పడిన ఆర్మీ కృషి ఎంతగానో ఉంది. కొద్ది రోజులు క్రితం కౌశల్‌కు వారి అభిమానులకు మధ్య గొడవలు జరిగాయి. కౌశల్ ఆర్మీ పేరిట ఏర్పాటు చేసిన సంస్థలోని డబ్బును తన వ్యక్తిగత ఖర్చులకు వాడుకుంటున్నారని ఆర్మీ సభ్యులు ఆరోపించారు. దీనిపై పలు టీవీ ఛానెల్స్ డిబెట్లు కూడా నిర్వహించాయి. ఈ విషయం పక్కన పెడితే, కౌశల్ తన భార్య ఆస్పత్రిలో ఉన్న ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశాడు. కౌశల్ తన సతీమణి నీలిమకు ఒక మేజర్ సర్జరీ జరగనుందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. కౌశల్ భార్య నీలిమ క్యాన్సర్‌తో భాదపడుతుందని గతంలో ఓ సందర్భంలో వెల్లడించాడు.
ఇప్పుడు దీనికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు కౌశల్. ఒక లైవ్ వీడియో ను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ నీలిమకు చేసిన సర్జరీ విజయవంతం అయిందని ప్రస్తుతం తను విశ్రాంతి తీసుకుంటుందని తెలిపాడు. నీలిమ పేషెంట్ లా బెడ్ మీద పడుకుని ఉంటే పక్కనే కూర్చుని తీసిన వీడియో పోస్ట్ చేశాడు. దీంతో చాలామంది ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతు మెసేజ్‌లు పెడుతున్నారట. మరి కొందరు అయితే ఇదంతా మరో పబ్లిసిటీ స్టంట్ అని కొట్టి పారేస్తున్నారు.
- Advertisement -
కౌశల్ భార్య నీలిమకు ఏమైంది..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -