Tuesday, May 7, 2024
- Advertisement -

ఈ ఉగాదికి అందరి హీరోల ఫ్యాన్స్ కి పండుగే..!

- Advertisement -

మార్చి 25న ఉగాది పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని ఫ్యాన్స్ కి టాలీవుడ్ స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వబోతుంది. ఉగాదికి స్టార్ హీరోలు తమ ఫస్ట్ లుక్ లు, టీజర్ లను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. మార్చి 24 పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ చిత్రం టీజర్ ను రిలీజ్ చేయడానికి నిర్ణయించారు.

రెండేళ్ల తర్వాత వస్తున్న పవన్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్ కూడా ఉగాది కానుకగా మార్చి 25న రిలీజ్ కానుంది. అలానే చిరు, కొరటాల కాంబోలో వస్తున్న ’ఆచార్య’ మూవీ ఫస్ట్ లుక్ కూడా ఈ ఉగాదికే రిలీజ్ కానుంది. అలానే .. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టైటిల్ లోగోను ఉగాదికి రిలీజ్ చేయనున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. మార్చి 27 రాంచరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ లోని రాంచరణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నాట. చరణ్ ఫస్ట్ లుక్ వస్తే మెగా ఫ్యాన్స్ కి అంతకన్న పెద్ద పండగ ఉండేదేమో. ఇలా టాలీవుడ్ హీరో తమ సినిమా విశేషాలతో ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇవ్వబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -